ఆందరికీ స్వాగతం

please leave your suggestions and opinions.

Monday, July 19, 2010

బాబు - బాబ్లి

గత వారం రోజులుగా న్యూస్ ఫాలో అవుతున్న అందరి మదిలో మెదిలే, కొందరి మదిలో మెరిసే ఆలోచన ఏమిటంటే 'ఇంత హఠాత్తుగా చంద్రబాబు కి బాబ్లి ఎందుకు గుర్తుకు వచ్చింది ' అని.ఈ వ్యవహారంలో నాకు అనిపించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని అనిపించి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
తెలంగాణా విషయంలో చంద్రబాబు ని ఇరకాటం లో పెట్టి టి.డి.పి. ని ఏ.పి. లో నామరూపాలు లేకుండా చేయాలని 'అమ్మ ' పన్నిన కుట్రలో, చంద్రబాబు ఎంతో తెలివిగా అంతకంటే ఎక్కువ ఓపికతో (దాదాపు నెలరోజులపాటు మీడియా కంటికి కనపడకుండా) తప్పించుకున్నారు. ఐతే ఆ దెబ్బ లో నష్టపోయింది (ఎంతో ఇంకా పూర్తిగా తేలలేదు) ఎవరయ్యా అంటే మన 'మెగా ' చిరు. అమ్మ తెలిసో తెలియకో ఒకరకంగా చంద్రబాబు కి మేలు చేసిందనే చెప్పాలి. ఎలాగంటే తెలంగాణా ఉప ఎన్నికలలో పోటీ నుంచి పి.ఆర్.పి. ని తప్పించడమే. ఎందుకంటే గత ఎన్నికలలో పి.ఆర్.పి. చాలా చోట్ల టి.డి.పి.ఓట్లను చీల్చింది. ఐతే తెలంగాణా ఉప ఎన్నికలలో కొన్ని సీట్లు గెలవాలన్నా ముందు ప్రచారం చెయ్యాలి కదా!. టి.ఆర్.ఎస్. వాళ్ళేమో ఆంధ్రా వాళ్ళని ప్రచారానికి కూడా రానివ్వ మంటున్నారాయే. సందట్లో సడేమియా లాగా ఇప్పుడే జగన్ ఓదార్చుతానంటుంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమి చెయ్యాలో పాలుపోని స్థితి లో వున్నారు. మరో వైపు డి.ఎస్ ఏమో తను గెలిస్తే సి.ఎం. అవుతానని ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు మధ్యంతర బాకా ఊదా వచ్చంటూ కధనాలు గుప్పిస్తున్నారు. అన్నింటికీ మించి తాము గెలిస్తే తెలంగాణా ఎలా తెస్తామో ఏ ఒక్క పార్టీ కూడా చెప్పకుండా ప్రజలను మరో సారి ఫూల్స్ ని చేయాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బాబ్లీ అంశం తెరమీదకి వచ్చింది. ఇందులో మనం చంద్రబాబు యొక్క రాజకీయ చాణక్య నీతి గమనించవచ్చు. ఇది తెలంగాణాలో తిరుగుతూ చేస్తున్న ప్రచారం కాదు, తను బయటే ఉంటూ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాగూ రాష్ట్రాల వ్యవహారంలో ఆ రాష్ట్రం లోని అన్ని రాజకీయ పక్షాలు ఏకమవుతాయని (మన వాళ్ళు తప్ప) తెలుసు కనుకనే ఈ వ్యూహం పన్నారు. ఎలాగైనా ఉప ఎన్నికల వరకూ జైల్ లోనే ఉంటే దాని ప్రభావం ఎంతో కొంత ఎన్నికలలో ఉంటుందని భావిస్తున్నాను. ఐతే ఇన్నాళ్ళూ గుర్తుకు రానిది ఇప్పుడు గుర్తుకు వచ్చినంత మాత్రాన భుజాలకెత్తుకోవటానికి ప్రజలేమి వెర్రివాళ్ళు కాదని కొందరి అభిప్రాయం. ఐతే నా ఊహ ఎమిటంటే ఈ విషయం ఎన్నికలలో లాభం కలిగించినా కలిగించక పోయినా, నష్టం మాత్రం కలిగించదు అని. ఒకరకంగా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది పెద్దవాళ్ళు చెప్పినట్లు 'పోతే వెంట్రుక వస్తే కొండ '. అన్నింటికీ మించి ఈ విషయం లో కనుక చంద్రబాబు నిజంగా సక్సెస్ ఐతే, ఈ పరిణామాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో మరో అధ్యాయానికి నాంది కావచ్చు. దేనికైనా మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

1 comment:

  1. అన్నా..! 2004 ఆగష్ట్‌లో అక్కడ బాబ్లి పునాది వేస్తున్నప్పుడే..టి.డి.పి. వాళ్ళు గొడవ చేసారు..తర్వాత టి.ఆర్.ఎస్ వాళ్ళు సుప్రీం కోర్ట్ లోకేసు వేసారు..తర్వాత పచ్చతమ్ముళ్ళు ఒక సారి కాదు మూడు సార్లు అక్కడ దర్నాలు చేసారు..2007 లో పాపం పచ్చతమ్ముళ్ళకు వీపులు.పగిలేలా..కాళ్ళు విరిగేలా..కుమ్మి పడేసారు..అందులో ఎర్రబల్లి దయాకర్ ని ఒకటే కుమ్ముడు...పాపం ఎర్రబల్లి..వీపు విమానమోత..ప్చ్ అప్పుడూ మన దేవుడు గారు కదా ఇక్కడి పాలన ఎటువంటి..స్పందనలేదు..చాలా సార్లు పోరాడారులే..కాని ఇప్పుడొచ్చినంత మైలేజి అప్పడు మీడియాలో రాలేదు అదీ సంగతి.

    ReplyDelete